ICC Cricket World Cup 2019: ENG v SA |England Won By 104 Runs On South Africa | Match Highlights

2019-05-31 165

Ben Stokes (89 and 2 for 12) and Jofra Archer (3 for 27) played starring roles for England who crushed South Africa by 104 runs in the opening match of the 2019 Cricket World Cup at The Oval on Thursday.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#benstokes
#jofraarcher
#england
#southafrica

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2019ను ఆతిధ్య ఇంగ్లండ్‌ విజయంతో ఆరంభించింది. లండన్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 207 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్‌ హీరో జోఫ్రా ఆర్చర్‌ (3/27), స్టోక్స్‌(2/12)లు దక్షిణాఫ్రికా వెన్ను విరిసాడు. ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న బెన్‌ స్టోక్స్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించింది. 8వ ఓవర్లో మార్‌క్రమ్‌ (11)ను ఔట్‌ చేసిన ఆర్చర్‌.. తన తర్వాతి ఓవర్లో కెప్టెన్ డుప్లెసిస్‌ (5)నూ పెవిలియన్ చేర్చాడు. మరోవైపు ఓపెనర్ ఆమ్లా కూడా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి ఉండడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. నాలుగో ఓవర్లో ఆర్చర్‌ బౌన్సర్‌ హెల్మెట్‌కు బలంగా తగలడంతో ఆమ్లా గాయపడ్డాడు.